Saturday, November 29, 2008

ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి

కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవేమో?! తప్పని తెలిసీ ధర్మరాజు పదే పదే జూదం ఎందుకు ఆడాడు ? సభ్యత కాదని తెలిసీ పాంచాలి దుర్యొధనుడిని చూసి ఎందుకు నవ్వింది ? రాముడిని అడవికి పంపమని కైక ఎందుకు కోరింది ? భారతం వ్యాసుడే ఎందుకు రాసాడు ? వాల్మికి రామాయణం ఎందుకు రాసాడు ? తమిళం ప్రాచీన భాషగా గుర్తించబడేదాక మన వాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం చేయలెదు ? ఎప్పుడూ మన సినిమాలలో బ్రాహ్మణులనే ఎందుకు బఫూన్లలా చూపిస్తారు ? విఙానం ఎంత పెరిగినా మనిషి ఇంకా బాణామతి లాంటివి నమ్ముతూ అమాయకులను అనుమానంతొ చంపుతారు ? ఎందుకు అమ్మాయిలు ప్రేమ నటించేవారి నే నమ్ముతారు ? ఎందుకు “నెను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎవరికైనా చెప్పాలంటే నొరు పెగలదు” ? ఎందుకు సూర్యుడు ఎప్పుడూ తూర్పునే ఉదయిస్తాడు ? తెల్లవారుజామున తొలికోడి కూసాకే తెల్లారింది అని ఎందుకు అనుకుంటాము ? ఎందుకు మనం నిత్యం ఒక శక్తి వచ్చి మనలను కాపాడాలని చూస్తాము ? మన శక్తిని మనం ఎందుకు నమ్ముకోము ? ఎందుకు ఆరు లేన్లు ఉన్న మన హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ తగ్గదు ? ఎందుకు మనం అరటి కాయలు తిని తొక్కలు రోడ్డు మధ్యలో పడేస్తాము ? ఎందుకు మనం సమాజం మన ఉమ్మడి కుటుంబం లాంటిది అని భావించము ? ఎందుకు మన శరీరంలోని నరాలు మన ఎదురుగా ఉన్న చెడుని ఎదిరించలేవు ? ఎందుకు మన ఒంట్లోని రక్తం చెడుని చూస్తె సలసలా మరిగిపోదు ? ఎందుకు మనము కనుల ఎదుట జరిగే అన్యాయాన్ని ఖండించలేకున్నాము ? ఎన్ని నీతులు చెప్పినా మన ఇంట్లో పనికి చిన్న పిల్లలను పెట్టుకొవటం ఎందుకు మానము ? ఎందుకు పిల్లలతో కలిసి ఏదైనా సినిమాకి వెళ్ళలంటే భయపడుతున్నాము ? ఎందుకు భూముల దరలు ఆకాశాన్ని తాకాయి ? ఎందుకు ఇంకా సగం జనాభా మురికివాదలలో నివసిస్తున్నది ? ఎందుకు ఇంకా పిల్లలలో పౌష్తికాహర లొపంతొ చావులు ఆగటం లేదు ? ఎందుకు మనం ఎంత సంపాదించిన కనీసం ఒక్క అనాద పిల్లాడి ఒక్క నెల స్కూల్ ఫీజు కట్టాలంటే అదేదో బ్రహ్మ కార్యంలా అనుకుంటామెందుకు ? ఎందుకు నేను ఇలా గమ్యం దొరకని ప్రశ్నలతో ఈ బ్లాగుని నింపుతున్నాను ?
- జవాబులు దొరికే అవకాశం ఉంది - తెలుసు ! అంతే కాదు అసలు ఈ ప్రశ్నలు మళ్ళీ ఎవరూ వేసే అవకాశం రానీయకుండానూ చేయవచ్చు. కానీ మనలో ఎంత మందిమి ఈ ప్రశ్నలకు జవాబు చెప్తాము, కొన్ని సమస్యలకు మనమే కారణం అన్నది తెలుసుకుని వాటిని నివారించడం చేస్తాము ?
సమాజంలోని పెద్ద సమస్యలు, వాటి మూలాలు, నివరణ మార్గాలు, ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ మరిచిపోండి ... నెను ఒక పని చెప్తాను చేయండి. అది ఏమిటి అంటారా ......
ఇవన్నీ మరిచిపోండి, ఒక్క మొక్క మీ పెరట్లో నాటండి – రోజూ దానికి నీళ్ళు పోయండి – అది పెరిగి మీ ఇంటికి నీడని గాని లేదా మీ పిల్లలకి పండ్లు గాని ఇచ్చేటట్టు చూడండి - వాటిని పక్కింటి పిల్లలతో కలిసి పంచుకోమని మీ పిల్లలకు నేర్పండి .. అది నీడైనా లెక పండ్లు ఐనా. సమాజానికి మీ వంతు మేలు చేసిన వారిలో ఒకరు అవుతారు.

జై భారత్!!!!

వందేమాతరం!

No comments: