Tuesday, November 25, 2008

ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న పథకాలు తక్షన ప్రయోజనాల ద్రుష్ట్యా చూస్తే అద్భుతమైనవే కాదనలేము. ఈ పథకాల అమలుతో కొన్ని వందల మంది లేదా వేల మంది లాభపడుతున్నారు .కాని ఈ లాభం ప్రజలకు దీర్గకాలానికా లేక స్వల్పకాలానికా ? తరచి చూస్తె ఈ పధకాలతో జరిగే లాభం తాటాకు మంట లాంటిది అని అనిపిస్తుంది . ఒక ఉదాహరణ : ఆరొగ్యశ్రీ – చాల మంచి పథకం. దీని ద్వారా ఎంతొ మంది పేద ప్రజలు తమ కలలొ సైతం ఊహించని వైద్య సదుపాయాలను ,అత్యంత ఖరీదైన శస్త్రచికిత్స సేవలను ఉచితంగా పొందగలరు. ఈ వ్యాసం రాసే సమయనికే ఈ పథకం వల్ల లాభపదిన వారి సంఖ్య వేలను దాటింది.ఈ పథకం పరిధి లొకి రాని వ్యాదులు, చికిత్సలు వీటి జొలికి మనం వెళ్లొద్దు. ఐతే మనం గమనించవలసిన విషయం ఏమిటంటె ఈ పదకం వల్ల అనారొగ్యం పోదు కేవలం చికిత్స.. కొన్నిసార్లు సమయానికి మరికొన్నిసార్లు ఆలస్యంగానో అందే అవకాశం మాత్రమే ఉంది. ఈ పదకానికి అయ్యే ఖర్చులొ కొంత భాగాన్నైనా సరే పారిశుధ్య నిర్వహణకు ,మంచి పరిసరాలు తయారు చేసేందుకు, ప్రభుత్వ ఆసుపత్రుల లొ మెరుగైన సదుపాయల కల్పన కు ఉపయోగించవచ్చు . ఇటువంటి కార్యక్రమలతో అరొగ్యశ్రీ వంటి అత్యవసర సేవలు అందించే పథకాల అవసరం తగ్గుతుంది …. వెంటనే కాకపొవచ్చు కాని దీర్ఘకాలంలొ ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందికానీ ప్రభుత్వం ఎప్పటిలాగే ప్రజలు నిత్యం తమ మీదే ఆదారపడి ఉండే పరిస్థితి పోకుండా జాగ్రత్తపడుతున్నట్టు అనిపించక మానదు. ప్రభుత్వం నడిపేది ఎవరైనా అది కాంగ్రెస్ లేదా పీ ఆర్పీ లేదా టిడిపి ఎవరైనా అందరు గుర్తుంచుకోవలసిన సామెత ఒకటి ఉంది“ ఒక వ్యక్తికి ఒకరొజు చేపను దానం ఇవ్వవద్దు , అందువల్ల అతని ఒక్క పూట ఆకలి మాత్రమే తీరుతుంది . అదే అతనికి చెపలు పట్టే కళను నెర్పించండి అతను జీవితాంతం ఆకలి లేకుండా బతుకుతాడు “ ఇప్పుడు ప్రభుత్వాలు మాత్రం బద్దకస్తులను తయారు చేసే యంత్రాలుగా మారుతున్నయేమో అన్న అభిప్రాయం మాత్రం నా మనసులొ నానాటికీ బలపడుతున్నది.

No comments: