Wednesday, November 26, 2008

సరదాకి

సాయంకాలం ఆరు గంటల సమయం అవుతోంది. పార్కులో కూర్చున్న ఆ అమ్మాయి మాటిమాటికీ అసహనంగా వాచీ చూసుకుంటూ ఉంది . చూడటానికి బాపు బొమ్మలా చాలా అందంగా ఉంది . ఒంటి మీది బంగారం ధధగలు చూస్తుంటే బాగ డబ్బున్న వాళ్ళ కూతురి లా కనిపిస్తుంది . చూదబొతే తన ప్రియుడి కోసమని పార్కు లొ నిరీక్షణ అనుకుంట అతని ఆలస్యానికి కాబోలు ప్రపంచంలోని చిరాకును అంతా తన ముఖంలోనే పెట్టినట్టు ఉంది . కాసేపటికి తనలొ తను ఏదో అనుకుంటూ ఆ అమ్మయి లేచి వడివడిగా బయటికి అదుగులు వేయసాగింది . అప్పటిదాక ఆమెనే గమనిస్తున్న ఒక హీరొ లేచి ఆమెను అనుసరించాదు . మన హీరొ పార్కు బయటికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి తన స్కూటీ తీస్తూ కనపడింది . మన హీరో కూడా తన హీరో హోండా కోసం పరుగుతీసాడు . కట్ చేస్తే నెక్లెస్ రోడ్డు మీద ఇద్దరి వాహనాలు మెల్లిగా పరుగులు పెడుతున్నాయి . ఆ అమ్మాయి స్కూటీకి పక్కనే తన హోండాను నెమ్మదిగా నదుపుతూ రేర్ వ్యూ మిర్రర్ను ఆమె కనపడేలా సరి చేసాడు . మొదట పట్టించుకోలేదు కాని తను ఎంత నెమ్మదిగా వెళుతున్నా బైక్ తనను దాటకపొయెసరికి ఆమెకు విషయం అర్థమయింది . అయినా ఆపకుందా అతన్ని అప్పుడప్పుడూ గమనిస్తూ వెళ్ళసాగింది . అతనికి కూడ అమె తనను గమనించిందని అర్థమై నవ్వుకున్నాడు . అతనికి కావలిసింది కూడా అదే కదా మరి. బైకుని చేతులు వదిలేసి అద్దాలు తీసి మల్లి పెట్టుకొవటం ఇలాంటి పనులు చేస్తూ అమె ద్రుష్టిని మరింతగా ఆకర్షించాడు . చివరికి వాళ్ళ ప్రయాణం ఒక సినిమా థియేటర్ వద్ద ముగిసింది . ఆమె వెళ్ళి ఒక టికెట్ తీసుకుంది అమ వెనుకే హీరో కూడ . ఆ అమ్మాయి వెల్లి వెయిటింగ్ లాంజ్ లొ కూర్చుంది . ఒక రెందు నిమిషాల పాటు మన హీరో ఇప్పుడు ఏం చేయాలా అని దీర్ఘంగా అలోచించాడు . ఏదో మంచి అలోచన వచ్చినట్టు నవ్వుకుంటూ వెళ్ళి రెందు కూల్ డ్రింక్ సీసాలు తీసుకుని ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి ఎదురుగా నిలబడ్డదు . ఆ అమ్మాయి తలెత్తి అతని వంక ఎమిటి అన్నట్టు ఒక ప్రశ్నార్థకమైన చూపు విసిరింది . “మీరు ఎమీ అనుకోనంటే” అంటూ ఒక సీసా అమె వైపు చాపాదు . “ మీరు ఎవరొ నాకు తెలీదు . . . . “ ఇంకా ఏదో అనబొతున్న ఆమెతో “ నా పేరు రాజు నెను సాప్ట్ వేర్ ఇంజనీర్ని సత్యం లో చేస్తున్నాను అడ్రెస్…. “ ఆపకుండా చెపుతున్న అతనికి అడ్డు తగిలి “ మీ పరిచయం కన్నా డ్రింకే బెతర్ “ అంటూ సీసా ని అందుకుంది . నవ్వుతూ అమె పక్క కుర్చీలో కూర్చుని “ మీరు చాల బాగున్నారు “ అన్నాడు. “తెలుసు అప్పటినుండీ నా వెనుకే వస్తుంటే ఆ మాత్రం అర్థం కాదా “ . “ మీరు ఎం చేస్తుంటారు “ అడిగాడు “ బి టెక్ లాస్టియర్ “ అంటూ అతని వంక దీర్ఘంగా చూసింది . గోదుమ రంగు చొక్కా నల్ల పాంటు లొకి ఇన్ చెసి ఉన్నాడు . మంచి ఫిజిక్ ఉన్నట్టుంది చొక్కా వెసుకున్నా కూడా అతని కండలు మెలితిరిగి కనపడుతున్నాయి . ఎర్రగా బుర్రగా ఉన్నాడు అనుకుంటున్న అమె అలోచనలను భగ్నం చేస్తూ “ ఎమిటి అలా చూస్తున్నారు “ అని అడిగేసరికి ఈ లోకం లొకి వచ్చి సిగ్గుపడింది . మీ పేరు అడుగుతున్నాను అండి – మళ్ళీ అడిగాడు “ శ్రావ్య” (తియ్యగా ఉంది అమ్మాయి పేరు గొంతు) అబ్బాయి మనసులొ అనుకున్నాడు . ఇంతలొ గంట మోగటంతో లేచి థియెటర్లొకి నడిచారు . పక్కపక్క సీట్లలో కూర్చున్నారు . సినిమా మొదలయింది . ఈ మధ్యే విడుదలైన అతి చెత్త సినిమాలలో ఒకటి అది . “ ఈ సినిమానా “ ఇద్దరూ ఒకేసారి పైకి గట్టిగా అన్నారు . అని ఒకరి వంక ఒకరు చూసుకుని నవ్వుకున్నారు . నవ్వటం ఆపి “ నా లాగే మీరూ పోష్టరు కూడా చూడకుండా వచ్చారు కదూ “ అదిగాడు రాజు . అవునన్నట్టు తలూపింది శ్రావ్య . తర్వాత తప్పదు అన్నట్టు సినిమా చూస్తూ ఉండిపొయారు . కాసేపటి తర్వాత మెల్లిగా అమె చేతి మీద తన చేయి వేసాడు . శ్రావ్య అది గమనించిన కూడా ఎమీ అనలెదు కానీ తన చెయి తీసుకొవటానికి చిన్న ప్రయత్నం చేసింది , ఏదొ అలా చెయ్యకపోథే పలుచన అవుతాననే గాని అమెకు కూడ అతని స్పర్శ నచ్చింది . అలా ఎలాగొ ఇంటర్వల్ వరకూ భారంగా చిన్న చిన్న స్పర్శలు కనుల మూగ బాసలు పంచుకుంటూ గడిపారు . ఇంటర్వెల్ అయ్యాక అమె చెవి వద్దకు చేరి “ వెల్దాం పద “ అన్నాడు “ఎక్కడికి “ లో స్వరంలో అడిగింది . “ కాస్త రొమాంటిక్ గా ఉండె చోటికి “ అన్నాడు . కొద్ది సేపు బెట్టు చేసి బతిమిలాడించుకుని లెచింది . ఈద్దరూ బయటికి వెళ్ళాక “ నీ బైకు తీసుకురా ఇద్దరం కలిసి వెల్దాము “ అన్నది శ్రావ్య . సరేనంటూ వెళ్ళి హోండాని తీసుకుని వచ్చాడు . అమె అతని బండి వెనుక ఎక్కి అతని నదుము చుట్టూ చేతులు వేసింది . “ మరి నీ స్కూటీ “ అడిగాడు రాజు . “ జానె దో భి యార్ రేపు చూసుకుందాము “ మరింత గట్టిగా హత్తుకుంది అతన్ని . అంతే అతని బండి 5 సెకన్లలొ 80 కిలొమీటర్ల వేగం అందుకుంది . పది నిమిషాలలో ఒక మంచి రెస్తారెంట్ ముందు బండిని ఆపాడు . ఇద్దరూ ఒకరి కళ్ళలొకి ఒకరు చూసుకుంటూ కాండిల్ లైట్ డిన్నర్ చేసారు . బిల్లు కట్టటానికి నేనంటే నేను అని పోటీ పడి చివరికి ఇద్దరూ కలిసి చెరి సగం కట్టి బయటికి వచ్చారు . “ఇప్పుడు ఎక్కడికి వెల్దాం “ అడిగాడు . “ మా ఇంటికి “ అతని జుట్టు చెరుపుతూ చెప్పింది “ అప్పుడేనా “ గారంగా అడిగాదు రాజు .” రేపు మళ్ళీ ఉంది కదా “ అంటూ అతన్ని సముదాయించింది . సరేనంటూ బండి తీసాడు . అమె దారి చెపుతుంటే మెల్లిగా నడుపుతున్నాడు . గల్లీలలొనుండి వెల్తుంటే హటాత్తుగా బండి ని ఆపమని అరిచింది బండిని ఆపి ఎమయింది అని అడిగాడు . “నా పర్సు పడిపొయింది” చెప్పిందామె . దిగి బండికి స్టాందు వేసి వెళ్ళి వెతకటం మొదలు పెట్టాడు . బండి దగ్గర నిలబడ్డ శ్రావ్య చుట్టూ ఒకసారి చూసింది . ఎవరూ లేరని ఖాయం చెసుకున్నాక మెల్లిగా రాజు వెనుకకి చెరి “హాండ్సప్ “ అంది . ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన రాజుకు శ్రావ్య చేతిలొ తుపాకి కనపడింది . “ఎంటిది “ అంతూ ముందుకు కదలబోయాడు .ఆగు అన్నట్టు పిస్టల్ని బెదిరింపుగా ఊపి “ తియ్యి బయటికి “ అన్నది ఆమె . ఏం తియ్యాలి అనబొయి ఆగిపొయాడు . అమె అభిసారిక కాదు తన జేబులొనూ ఒంటి మీదా ఉన్న సంపదనూ చుట్ట చుట్టుకుపొవతానికి వచ్చిన వయ్యారి దొంగ అని అర్థమై తనని తాను తిట్టుకున్నాడు . 5 నిమిషాల తర్వాత ఖాళీ జెబులు, బోసి మెడతో రోడ్డు మీద నిలబడ్డాడు రాజు . “ ఛ ఇది స్కూటీని అక్కడ వదిలేసి వచ్చినప్పుడే అనుమనించాలిసింది “ అనుకునంటూ “ ఐనా ముందు జాగ్రత్త ఉండాలి కాని చేతులు కాలాక ఎన్ని అనుకుంటే ఎం లాభం – అనుకుంటూ రోడ్డుకు రెండు వైపులా చూసాడు . ఎవరో బండి మీద వస్తూ కనబడ్డారు “ అమ్మయ్య కనీసం కాలిన చేతులకు అయింటుమెంటన్నా రాసుకుందాం “ అనుకుంటూ సాక్సు లొ నుండి కత్తి తీసుకుని బండి మీద వస్తున్న వ్యక్తికి అడ్డం వెళ్ళాడు.

No comments: