Saturday, November 22, 2008

ఇవాళ నేను రాజకీయాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను . ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన చిరంజీవి రాజకీయాలలోకి రావటం గురించిన చర్చ వినబదుతూ ఉంది . చిరంజీవి రాజకీయాల లోకి రావడం అతని వ్యక్తిగత నిర్ణయం కాని ఆయన ఆ నిర్ణయం తో ప్రజలకు ఎలా సేవ చేయాలని అనుకుంటున్నారు అన్నదే ప్రశ్న . సేవ కు పదవులు అవసరం లేదు అన్నది ఆయన అభిప్రాయం అని చాలాసార్లు చెప్పటం జరిగినది. మరి ఇప్పుడు ఈ పార్టీ పెట్టడం ఎందుకు ? ఇవన్ని పక్కన పెడితే పోలేపల్లి సెజ్ బాధితులు , సిరిసిల్ల నేత కార్మికులు ఇలా ప్రాముఖ్యమైన కొన్ని సమస్యలను ఎన్నుకున్నారు ఇవి చాల ముఖ్యమైన సమస్యలు ఎవరు కాదు అనలేనివి. ఐతే వీటికి పరిష్కారం ఏంటి ?సమస్యకు మూలాలు ఏంటి ?కొత్త పార్టీకి వీటి పరిష్కారం గురించి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా ? లేక అధికారం లోకి వచ్చాక పరిష్కారం గురించి ఆలోచించవచ్చు అనేది పార్టీ నాయకత్వం యొక్క భావనా? అనేది ఇప్పుడు ప్రజల మనస్సులో ఉన్న సందేహం . ఈ సందేహాలను తీర్చేందుకు చిరంజీవి ఇంకా ఆయన పార్టీలోని ముఖ్యులు కృషి చేయవలసి ఉంది . పార్టీ అధికారం లోకి రావడానికి సరైన సమస్యలను ఎన్నుకోవడం వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది అన్న విషయాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడం సాధారణంగా ప్రతిపక్షాలు చేసే పని అన్నది జగద్విదితం .మరి చిరంజీవి పార్టీ కూడా ఇదే సూత్రాన్ని అనుసరించి అధికారం కోసం ప్రయత్నిస్తే వారికి మిగతా పార్టీలకు తేడా ఉండదు. వారి నాయకత్వం చెపుతున్న " మార్పు " కూడా ప్రస్నార్ధకమవుతుంది . ఇప్పుడు చిరంజీవి లాంటి విజ్ఞుడు చేయవలసిన పని ఏంటి అంటే తను వారికంటే భిన్నమయిన వాణ్ని అని నిరూపించుకోవాలి .అది ఎలా అంటే ఆయన తను ఎంచుకున్న సమస్యలకు తన వద్ద పరిష్కారాలు ఉన్నాయని ప్రజలకు తెలియజేయాలి . అప్పుడే ఆయన ఎన్నికలలో విజయం కోసం కాక ప్రజలకు మంచి జరగాలనే ఈ సమస్యల పై తన గళం వినిపించారని జనాలకు తెలుస్తుంది . అంతే కాని అధికారంలోకి వస్తే ఈ సమస్య పరిష్కరిస్తాను అంటే అది పదవి కోసం పాకులటగా జనం భ్రమించే అవకాశం ఉంది . ఇప్పుడు బంతి చిరంజీవి కోర్టులో ఉంది ఆయన ఇప్పుడు ఎం చేయబోతున్నారు గోల్ సాధించగలరా ?

No comments: