Tuesday, December 2, 2008

అయిపొయింది.. ముంబైని గడగడలాడించిన ఉగ్రవాదులను మన వీరులైన సైనికులు, పోలీసులు మట్టుపెట్టారు . ఈ పోరాటంలో తమ ప్రాణాలను సైతం లెక్క చెయకుండా పోరాడి మన కోసం తమ ప్రాణాలు త్యజించిన వీరులకు మనం తప్పక నివాళులు అర్పించాల్సిన సమయం ఇది. జోహార్లు వీర సైనికులారా …. జోహార్ ! ఐతే మనం అందరము ఇక్కడ గుర్తుంచుకొవలసిన విషయం ఒకటి ఉంది … గూడచారి విభాగాల వైఫల్యాల సంగతి పక్కన పెడితే సాధారణ పౌరులుగా మన బాద్యతలను సైతం మనం అప్పుడప్పుడూ విస్మరిస్తున్నామేమో అనే అనుమానం నాకే కాదు సమాజం గురించి అలోచించే ప్రతి ఒక్కరికీ రాక మానదు . మనం మన చుట్టూ అనుమానాస్పదంగా కనపడే వాటి గురించి ఏ మాత్రం శ్రధ్ధ చూపిస్తున్నాము ? వాటి గురించి ఎప్పుడైనా పోలిసులకు సమాచారం అందించామా ? ఎవరికి వారు మనకు సంబందించినది కాదులే అని ఊరుకొబట్టే ఇవాళ రౌడీలూ, గూండాలు, ఉగ్రవాదులు విచ్చలవిడిగా సమాజంలో తిరుగుతున్నారు . మనం సమాజం పట్ల మన బాద్యతను సరిగా నెరవేరిస్తే , ఇలాంటి సంఘటనలను కొంతలొ కొంత నివారించగలము . ఈ పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించటమే కాదు వారి కుటుంబాలకు మన వంతు సాయం అందించాలి. ఆప్పుడే ఇలాంటి మరికొంతమంది వీరులు మళ్ళీ మళ్ళీ సాటి వారి కోసం, సమాజం కోసం , దేశం కోసం తమ ప్రాణాలు ఒడ్డుతుంటారు . ఇక్కడ మనం కర్కరే ( ఏ టి యస్ అదికారి ) గారి భార్య ప్రవర్తించిన తీరును గుర్తు తెచ్చుకుంటే అది అనవసరమైన ప్రస్తావన అవదు . అమె గుజరాత్ సీ యం ప్రకటించిన విరాళం తిరస్కరించి మన రెండు నాల్కల రాజకీయ నాయకుల ముఖాన చెళ్ళున కొట్టినట్టు ఉండే పని చేసింది . అలాంటి స్వాభిమానులకు మనం ఆసరాగా నిలవాల్సిన తరుణం ఇది . మానసికం గాను ఆర్దికంగానూ వారికి మనం వారికి తోదుగా నిలిచి మన బాద్యత నెరవేర్చాలి.నా వంతుగా నేను వారికోసం రూ. 2000/- విరాళాన్ని ప్రధానమంత్రి సహాయనిధి కి జమ చేస్తున్నాను . మరి మీరు మీ వంతుగా ఏం చెయగలరో చూడండి. జై హింద్ .

No comments: